సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 19:44:15

ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టుల క‌ల‌క‌లం

ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టుల క‌ల‌క‌లం

కుమ్రంభీం ఆసిఫాబాద్ : జిల్లాలోని తిర్యానీ మండ‌లంలో ఐదుగురు మావోయిస్టులు పోలీసుల‌కు చిక్కిన‌ట్లే చిక్కి త‌ప్పించుకుపోయారు. పోలీసుల క‌ద‌లిక‌ల‌ను గ‌మ‌నించిన మావోయిస్టులు పారిపోయారు. మావోలు త‌ప్పించుకుపోయిన ప్రాంతం నుంచి విప్ల‌వ సాహిత్యం, డిటోనేట‌ర్లు, కొన్ని ఎల‌క్ర్టానిక్ వ‌స్తువులు, కార్టెక్స్ వైర్లు, యూనిఫాంల‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 

ఈ ఘ‌ట‌న‌పై ఇంచార్జి ఎస్పీ విష్ణు వారియ‌ర్ మీడియాకు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. తిర్యానీ మండ‌లంలో మావోయిస్టులు సంచ‌రిస్తున్న‌ట్లు పోలీసుల‌కు స‌మాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వ‌హించారు. పోలీసుల‌కు మావోలు చిక్కిన‌ట్లే చిక్కి త‌ప్పించుకున్నారు. ఐదుగురిలో ఇద్ద‌రిని మైల‌రేపు అదేలు అలియాస్ భాస్క‌ర్(స్టేట్ క‌మిటీ మెంబ‌ర్), వ‌ర్గీస్ కోయ లేదా మంగులు(ఏరియా క‌మిటీ మెంబ‌ర్)గా పోలీసులు గుర్తించారు. మావోయిస్టుల ఆచూకీ కోసం ప్ర‌త్యేక బ‌ల‌గాలు రంగంలోకి దిగాయి. 


logo