గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 19:31:35

ఐదుగురు మావోయిస్టు సానుభూతి పరులు అరెస్టు

ఐదుగురు మావోయిస్టు సానుభూతి పరులు అరెస్టు

జయశంకర్ భూపాలపల్లి : మావోయిస్టులకు పేలుడు పదార్ధాలు సరఫరా చేస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు కాటారం డీఎస్పీ బోనాల కిషన్ తెలిపారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం గుత్తికోయల గూడెం శివారులో కొందరు మావోయిస్టులకు సామగ్రి సరఫరా చేస్తున్నట్లు  పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు నిఘా పెట్టి అనుమానాస్పదంగా ఉన్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రెండు జిలెటిన్ స్టిక్స్, రెండు డిటోనేటర్లు, రెండు టిఫిన్ బాక్సులు, మావోయిస్టు కరపత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ వెల్లడించారు. కొంతకాలంగా వీరు మావోయిస్టు సానుభూతి పరులుగా పని చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిందితులను విచారిస్తున్నామని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo