సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 14:45:18

చర్లలో ఐదుగురు మావోయిస్టు కొరియర్లు అరెస్టు

చర్లలో ఐదుగురు మావోయిస్టు కొరియర్లు అరెస్టు

చర్ల :  రాష్ట్రంలో మావోయిస్టు కదలికలపై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. మావోయిస్టు ప్రాబల్యమున్న జిల్లాల్లో పకడ్బందీ నిఘా అమలు చేస్తుండటంతో పెద్ద సంఖ్యలో సానుభూతిపరులు, కొరియర్లు పట్టుబడుతున్నారు. సోమవారం ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రం నుంచి ఛత్తీస్‌గఢ్‌లో మావో అగ్రనేతలను కలిసి వారికి కావాల్సిన సమాచారం, వస్తువులను అందించేందుకు వెళ్తున్న ఐదుగురు సానుభూతి పరులను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.

మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో పోలీసులు ఐదుగురు మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేశారు. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు, గ్రీన్‌ క్లాత్‌, నిత్యావసర వస్తువులు అందించేందుకు తీసుకెళ్తుండగా గుర్తించి పట్టుకున్నారు. పట్టుబడిన వారిని కోరం జోగా, పొడియం జోగా, బాడిస లక్ష్మా, సోడి లక్మ, కొర్స సురేశ్‌గా గుర్తించారు. వీరు గత 4 సంవత్సరాలుగా నిషేధిత సీపీఐ జేగురుగొండ  మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యులు జగదీశ్‌, నాగమణిలకు కొరియర్లుగా ఉంటూ లోకల్ మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్నారని విచారణలో తెలింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.