కడెం: ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు ఐదు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 30 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 29,465 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులకుగాను ప్రస్తుతం 696.475 అడుగుల నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయిన నీటినిల్వ 7.603 టీఎంసీలు. ప్రస్తుతం 6.665 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.