శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Aug 23, 2020 , 14:39:32

బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో క‌రోనా క‌ల‌క‌లం

బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో క‌రోనా క‌ల‌క‌లం

హైదరాబాద్‌: న‌గ‌రంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కరోనా కలకలం సృష్టించింది. కార్యాలయ సిబ్బందిలో ఐదుగురు కరోనా పాజిటివ్‌గా తేలారు. 40 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా ఐదుగురు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యింది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్‌రెడ్డికి కరోనా పాజిటివ్ అన్న విషయం తెలిసిందే. దీంతో పార్టీ కార్యాల‌యంలో క‌రోనా నిబంధనల‌ను త‌ప్ప‌నిస‌రిగా అమలు చేయాలని నిర్ణ‌యించిన‌ట్లు నాయ‌కులు తెలిపారు. కరోనా సోకిన ఉద్యోగులను ఇప్ప‌టికే క్వారంటైన్‌కి తరలించామన్నారు. పార్టీ ఆఫీస్‌ను శానిటైజేష‌న్ చేస్తున్నారు. 


logo