బుధవారం 03 జూన్ 2020
Telangana - Jan 22, 2020 , 03:36:19

పునర్వ్యవస్థీకరణపై ఐదు కమిటీలు

పునర్వ్యవస్థీకరణపై ఐదు కమిటీలు
  • నీటిపారుదలశాఖ అంతర్గత కసరత్తు ముమ్మరం


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర నీటిపారుదలశాఖ పునర్వ్యవస్థీకరణపై అంతర్గత కసరత్తును ముమ్మరంచేసింది. ఇప్పటికే ఒకదఫా వర్క్‌షాప్‌ నిర్వహించిన అధికారులు.. ఇంకా విస్తృతంగా సంప్రదింపులు కొనసాగించేందుకుగాను ఐదు కమిటీలను నియమించుకున్నది. ఈ మేరకు నీటిపారుదలశాఖ ఈఎన్సీ నాగేంద్రరావు ఆయా కమిటీల ఏర్పాటుపై ఈఎన్సీలు, సీఈలకు లేఖలు రాశారు. నీటిపారుదలశాఖలోని ఇంజినీర్లు, మానవవనరుల పునర్వ్యవస్థీకరణ కమిటీకి ఈఎన్సీ నాగేంద్రరావు, ఆర్థికవనరుల కమిటీకి కాళేశ్వరం ఈఎన్సీ బీ హరిరాం, ప్రాజెక్టుల నిర్వహణ, ఆపరేషన్‌ కమిటీకి కరీంనగర్‌ ఈఎన్సీ అనిల్‌కుమార్‌, ఇరిగేషన్‌, నాన్‌ అస్తులపై కమిటీకి గోదావరి బేసిన్‌ కమిషనర్‌ ఆర్‌ మధుసూదన్‌రావు, చట్టాలు-విధానాలు-న్యాయపరమైన అంశాలపై కమిటీకి గోదావరి లిఫ్టు పథకాల సీఈ కే బంగారయ్యను చైర్మన్లుగా నియమించారు. ఆయా కమిటీల్లో ఈఎన్సీలు, సీఈలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలతో బుధవారం జలసౌధలో ప్రభుత్వ సలహాదారు ఎస్కే జోషి సమావేశం కానున్నారు. logo