బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 15:34:10

విద్యుత్ షాక్ తో ఐదు పశువులు మృతి

విద్యుత్ షాక్ తో ఐదు పశువులు మృతి

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా లోని చండ్రుగొండ మండలం బెండ్ ఆలపాడు గ్రామానికి చెందిన రైతులు బచ్చల రమణ నరసింహారావు కుంజా ఆదిరాజు వాడే కోటేశ్వరరావులకు చెందిన పాడి పశువులు.. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృతి చెందాయి. సోమవారం ఉదయం మేతకు వెళ్లిన పశువులు రాత్రివేళల్లో కురిసిన వర్షానికి తెగిపడిన విద్యుత్ వైర్ లకు అనుకోకుండా తగిలి చనిపోయాయి. వీటి విలువ సుమారు రెండు లక్షల 50 వేల వరకు ఉంటుందని బాధిత రైతులు వాపోయారు. బాధిత రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని గ్రామస్తులు కోరుతున్నారు.


logo