బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 20:59:55

యూరియా కలిసిన నీరు తాగి ఐదు పశువులు మృతి

యూరియా కలిసిన నీరు తాగి ఐదు పశువులు మృతి

గాంధారి : కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని కాయితీ తండాలో యూరియా కలిసిన నీటిని తాగి ఐదు పశువులు మృతిచెందాయి. తండావాసులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్మీరా సక్రుకు చెందిన రెండు ఎద్దులు, మూడు కోడెలను ఎప్పటిలాగే  పంట చేనులో మేతకు తీసుకెళ్లాడు. మధ్యాహ్నం పశువులకు నీరు తాగించేందుకు సమీపంలోని పంట చేనుకు తీసుకెళ్లాడు. అక్కడ డ్రిప్‌ కోసం ఏర్పాటు చేసిన కుండీలోని నీటిలో యూరియా కలిపి ఉంచారు. సక్రు దీన్ని గమనించక ఆ నీటిని పశువులకు తాగించాడు. నీరు తాగిన దీంతో పశువులు అస్వస్థతకు గురయ్యాయి. పశువైద్య సిబ్బందికి సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే రెండు ఎద్దులు, మూడు కోడెలు మృతిచెందాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పశువులను పరిశీలించారు.logo