బుధవారం 03 జూన్ 2020
Telangana - Feb 26, 2020 , 16:42:10

కారు డ్రైవర్ కు ఫిట్స్..డాక్టర్ కు గాయాలు

కారు డ్రైవర్ కు ఫిట్స్..డాక్టర్ కు గాయాలు

హైదరాబాద్ : కారు డ్రైవర్ కు హఠాత్తుగా ఫిట్స్ రావడంతో కారు బైకులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో హౌజ్ సర్జన్ డాక్టర్ చేయి విరిగింది. డాక్టర్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన నిలోఫర్ ఆస్పత్రి ప్రాంగణంలో జరిగింది. లియాకత్ అలీ అనే డ్రైవర్ తన కారులో ఓ రోగిని నిలోఫర్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. లియాకత్ అలీ తిరిగి వెళ్లే క్రమంలో కారును వెనక్కి తీస్తుండగా అతనికి ఫిట్స్ (మూర్చ) రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 


logo