మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 12:05:11

‘కాలేశ్వరం జలాల్లో మీనాల పరుగులు’

‘కాలేశ్వరం జలాల్లో మీనాల పరుగులు’

పెద్దపల్లి (మంథని టౌన్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం  ప్రాజెక్టు ఫలాలు అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఇందుకు నిలువెత్తు నిదర్శనమే గణనీయంగా పెరిగిన మత్స్య సంపద. గత కొద్ది రోజులుగా ప్రాజెక్టులో గేట్లు ఎత్తివేసి  నీటిని విడుదల చేసిన నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు బరువైన చేపలు చిక్కు తున్నాయి. 

దీంతో మత్స్యకారులకు చేతినిండా పని దొరికి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. అలాగే ప్రజలకు సైతం సరసమైన ధరలో చేపలు అందుబాటులో లభ్యమవుతున్నాయి. మార్కెట్ ఏరియాలో, గ్రామగ్రామాన చేపల విక్రయాలు జోరుగా సాగుతుండడంతో ప్రతి ఇంట్లో చేపల పులుసే స్పెషల్ ఐటమ్ గా కనిపిస్తోంది.


మంథని గోదావరి తీరంలో బుధవారం మత్స్యకారులు బరువైన చేపలను పట్టి మార్కెట్ లో విక్రయించారు. పెద్ద పెద్ద చేపలు విక్రయానికి రావడంతో చేపల ప్రియులు ఎగబడి కొనుగోలు చేశారు. కేజీ రూ. 150 చొప్పున ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దాదాపు నాలుగు క్వింటాళ్ల చేపలను విక్రయించినట్లు మత్స్యకారులు తెలిపారు. గతంలో ఎన్నడు లేని విధంగా బరువైన చేపలు దొరుకుతుడడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.logo