మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 01:56:22

26 నుంచి మత్స్యకారుల సభ్యత్వ నమోదు

26 నుంచి మత్స్యకారుల సభ్యత్వ నమోదు

  • మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌  

హైదరాబాద్‌, జనవరి 12 (నమస్తే తెలంగాణ): మత్స్యకారులకే చెరువులో చేపలు పట్టే అవకాశం కల్పిస్తామని పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. 18 ఏండ్లు నిండిన మత్స్యకార యువకులకు ఈ నెల 26 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ముదిరాజ్‌, గంగపుత్ర, తెనుగు, గుండ్ల బెస్త, బెస్త, ముతరాసి కులాలకు చెందిన వారికి సభ్యత్వాన్ని ఇవ్వాలని సూచించారు. సభ్యత్వ నమోదు పూర్తికాగానే రాష్ట్రంలోని అన్ని మత్స్య సహకార సొసైటీలకు ఎన్నికలను నిర్వహిస్తామని ప్రకటించారు.  .  


logo