బుధవారం 03 జూన్ 2020
Telangana - May 18, 2020 , 16:04:40

వనపర్తి జిల్లాలో మూడు టన్నుల చేపలు మృతి

వనపర్తి జిల్లాలో మూడు టన్నుల చేపలు మృతి

వనపర్తి : జిల్లాలోని రాజనగరం గ్రామ పరిధిలో ఉన్న నల్లచెరువు, అమ్మచెరువులో వేల సంఖ్యలో చేపలు మృతి చెందాయి. నీటి కాలుష్యం కారణంగా ఆక్సిజన్‌ కొరతతో మూడు టన్నుల చేపలు మృతి చెందినట్లు మత్స్యకారులు తెలిపారు. గతేడాది ఆగస్టులో ఈ రెండు చెరువుల్లో 1.5 లక్షల చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం వదిలింది. ఆ చేపలన్ని ఇప్పుడు చనిపోవడంతో మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారు. వేల సంఖ్యలో చేపలు మృతి చెందడంతో మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేశారు.


logo