సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 11:11:24

ఆలయ చరిత్రలో ఇదే మొదటిసారి: మంత్రి తలసాని

ఆలయ చరిత్రలో ఇదే మొదటిసారి: మంత్రి తలసాని

హైదరాబాద్‌: కరోనా కారణంగా సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరను నిరాడంబరంగా నిర్వహించనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటించారు. ఆదివారం నుంచి ఉజ్జయినీ మహంకాళి బోనాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో జాతర ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఆలయ చరిత్రలో మొదటిసారిగా భక్తులు లేకుండా బోనాల వేడుకలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతిఒక్కరు ఇళ్లలోనే ఉంటూ బోనాలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనవసరంగా బయటకు వచ్చి భక్తులు ఇబ్బందులు పడొద్దని సూచించారు.  


logo