శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 20:25:57

మొట్టమొదటి ప్రపంచ సంగీత సాహిత్య సమ్మేళనం

మొట్టమొదటి ప్రపంచ సంగీత సాహిత్య సమ్మేళనం

హైదరాబాద్ : మొట్టమొదటి ప్రపంచ సంగీత సాహిత్య సమ్మేళనం నవంబర్‌ 1వ తేదీన జరగనుంది. భారత్‌తో పాటు అమెరికా, యూకే, సింగపూర్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, హాంగ్‌కాంగ్‌, స్వీడన్‌, దక్షిణాఫ్రికా దేశాల నుంచి 58 మంది గాయనీ గాయకులు ఈ సంగీత సమ్మేళనంలో పాల్గొననున్నారు. పద్మభూషణ్‌, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాల గ్రహీత, కళాప్రపూర్ణ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి 123వ జయంతిని పురస్కరించుకుని సద్గురు ఘంటసాల ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌, ఇండియా, వంశీ ఇంటర్నేషనల్‌, ఇండియా, శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సంగీత కార్యక్రమం నిర్వహణ జరుగుతోంది. 12 గంటల పాటు కార్యక్రమం కొనసాగనుంది. ఈ సందర్భంగా ప్రముఖ సినీ గేయ రచయిత, కవి భువనచంద్రకు దేవులపల్లి-వంశీ జాతీయ సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. నవంబర్‌ 1వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సంగీత సమ్మేళనం రాత్రి 11 గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా కొనసాగనుంది. కార్యక్రమాన్ని తిలకించి ఆనందించి మీ ప్రోత్సాహాన్ని, ఆశీస్సులను అందజేయాల్సిందిగా నిర్వాహాకులు కోరారు. 

Facebook Live: https://bit.ly/37OM6v6

Youtube Live: https://bit.ly/31QLHV9