బుధవారం 27 మే 2020
Telangana - May 13, 2020 , 01:37:22

సీఎంకు తొలి తెలంగాణ యాపిల్‌!

సీఎంకు తొలి తెలంగాణ యాపిల్‌!

  • కేసీఆర్‌ నుంచి కేంద్రె బాలాజీకి పిలుపు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలోనే తొలిసారిగా యాపిల్‌ సాగుచేస్తున్న రైతు కేంద్రె బాలాజీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసే అరుదైన అవకాశం లభించింది. ఈ నెలాఖరున తన తొలిపంటను రైతు బాలాజీ.. ముఖ్యమంత్రికి అందజేయనున్నారు. కశ్మీర్‌ వంటి శీతల ప్రాంతాలకే పరిమితమైన యాపిల్‌ తోటను కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామానికి చెందిన కేంద్రె బాలాజీ తన వ్యవసాయక్షేత్రంలో సాగుచేస్తున్నారు. ప్రభుత్వ సహకారంతో రెండెకరాల్లో సాగుచేసిన యాపిల్‌ పంట ఈ నెలలో కోతకు రానున్నది. తెలంగాణలో యాపిల్‌ సాగుపై ఈ నెల 3న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ విషయం సీఎం కేసీఆర్‌ దృష్టికి వెళ్లింది. దీనిపై హర్షం వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. యాపిల్‌ రైతు బాలాజీని తనను కలిసేందుకు తీసుకురావాలంటూ ఉద్యానశాఖ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు బాలాజీకి ఉద్యానశాఖ కమిషనర్‌ సమాచారం అందించారు. ఈ నెల చివరి వారంలో యాపిల్‌ పండ్లు చేతికి రానుండడంతో.. బాలాజీ తన తొలి పంటను తీసుకెళ్లి ముఖ్యమంత్రిని కలువనున్నారు. 


logo