సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 17:56:25

తొలిదశ మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలి : మంత్రి హరీశ్ రావు

తొలిదశ మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలి : మంత్రి  హరీశ్ రావు

సిద్ధిపేట : నెల రోజుల్లో రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ కు సంబంధించిన బండ్, ఖాళీ స్థలాల్లో మొదటి దశ మొక్కలు నాటే కార్యక్రమాన్ని  పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. బుధవారం రంగనాయక సాగర్ జలాశయం బండ్, ఖాళీ స్థలాల్లో ప్లాంటేషన్ మొక్కలు నాటే కార్యక్రమంపై రంగనాయక సాగర్ పర్యవేక్షక ఇంజనీర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

కలెక్టర్ వెంకట్రామ రెడ్డి మాట్లాడుతూ..  రంగనాయక సాగర్ జలాశయం బండ్ , జలాశయం ఆనుకొని 100 ఎకరాల ప్లాంటేషన్ కు అనువైన స్థలం ఉందని తెలిపారు. ఈ స్థలాన్ని  సెక్టార్ల వారీగా విభజించి 38 వేల మొక్కలు నాట వచ్చని మంత్రికి వివరించారు. మొదట 25 ఎకరాల్లో ప్లాంటేషన్ చేపట్టాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల్లో ప్లాంటేషన్ ను ప్రారంభించి నెల రోజుల్లో పూర్తి చేయాలన్నారు.

ఇరిగేషన్, ఉద్యానవన అధికారులు, డీఆర్‌డీవో అధికారులు సంయుక్తంగా ప్లాంటేషన్ పనులు ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలని సూచించారు. మొండి రకానికి చెందిన చింత, జామమ, సీతాఫలం మొక్కలను మొదటి ఫేజ్లో నాటాలన్నారు.సమావేశంలో జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, అదనపు కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్‌,  సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఇరిగేషన్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo