ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 19:34:25

ట్రైనీ కానిస్టేబుళ్ల‌కు ప్ర‌థ‌మ చికిత్సా శిక్ష‌ణ‌

ట్రైనీ కానిస్టేబుళ్ల‌కు ప్ర‌థ‌మ చికిత్సా శిక్ష‌ణ‌

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని పోలీస్ సిటీ ట్రైనింగ్ కాలేజీలో శిక్ష‌ణ పొందుతున్నకానిస్టేబుళ్లకు అధికారులు ప్ర‌థ‌మ చికిత్సా శిక్ష‌ణ‌ను అందిస్తున్నారు. కాలేజీ ప్రిన్సిపాల్ విజ్ఞ‌ప్తి మేర‌కు సికింద్రాబాద్ మిల‌ట‌రీ ఆస్ప‌త్రికి చెందిన వైద్యుల బృందం, న‌ర్సింగ్ ఆఫీస‌ర్లు, పారామెడిక‌ల్ సిబ్బంది కానిస్టేబుళ్ల‌కు రెండు రోజుల శిక్ష‌ణా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. థియ‌రీతో పాటు ప్రాక్టిక‌ల్ శిక్ష‌ణ‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. మొత్తం 233 మంది అభ్య‌ర్థులు శిక్ష‌ణ పొందుతున్నారు. ఏదైనా ప్రమాదాలు లేదా ప్రతికూల పరిస్థితుల్లో స‌హ‌జంగా పోలీసులే మొదట‌గా ప్రతిస్పందిస్తుంటారు. ఈ నేప‌థ్యంలో ప్రాణన‌ష్ట నివార‌ణ‌కు, గాయాల తీవ్ర‌తను త‌గ్గించేందుకు ఈ శిక్ష‌ణ వీరికి ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌నున్న‌ట్లు తెలిపారు. ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు గోల్డెన్ అవ‌ర్‌గా భావించే తొలి గంట‌లోనే ప్ర‌థ‌మ చికిత్స అందితే ఎంతో మంది ప్రాణాల‌ను కాపాడొచ్చ‌ని అధికారులు పేర్కొన్నారు.


logo