శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 22, 2020 , 22:44:54

బ్యాంక్‌లో చెలరేగిన మంటలు

బ్యాంక్‌లో చెలరేగిన మంటలు

హైదరాబాద్‌ : రామంతాపూర్‌లో భావన కో- ఆపరేటివ్‌ బ్యాంకులో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాంకులో షార్ట్‌సర్క్యూట్‌ సంభవించి మంటలు చెలరేగి మంటలు వ్యాపించాయి. క్షణాల్లో మంటలు వ్యాపించి కంప్యూటర్లు, ఏసీలు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

అదేవిధంగా మల్లాపూర్‌లోని గోకుల్‌నగర్‌లోని ఓ టైర్ల కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఫైరింజన్ల సామంతో మంటలు అదుపు చేసేందుకు ఫైర్‌ సిబ్బంది ప్రయతిన్స్తున్నారు. భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు. మంటలు అదుపులోకి వస్తే నష్టం  అంచనా వేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo