మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Aug 21, 2020 , 12:36:36

శ్రీశైలం అగ్నిప్ర‌మాదం.. కొన‌సాగుతున్న స‌హాయ‌క చ‌ర్య‌లు

శ్రీశైలం అగ్నిప్ర‌మాదం.. కొన‌సాగుతున్న స‌హాయ‌క చ‌ర్య‌లు

హైద‌రాబాద్ : శ్రీశైలం అగ్నిప్ర‌మాదం ఘ‌ట‌న‌లో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. మూడు ఫైరింజ‌న్లు, మూడు అంబులెన్స్‌ల‌ను సిద్ధంగా ఉంచారు. విద్యుత్ కేంద్రంలోకి విడుత‌ల వారీగా ఫైరింజ‌న్‌, అంబులెన్స్ సిబ్బంది వెళ్తున్నారు. విద్యుత్ కేంద్రంలో అలుముకున్న పొగ‌ను అగ్నిమాప‌క సిబ్బంది అదుపు చేస్తోంది. మ‌రో రెండు, మూడు గంట‌ల్లో త‌ప్పిపోయిన 9 మంది ఆచూకీ ల‌భ్య‌మ‌య్యే అవ‌కాశం ఉంది. విద్యుత్‌ను పున‌రుద్ధ‌రిస్తే.. వారు ఎక్క‌డున్నార‌న్న విష‌యం తెలిసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. విద్యుత్‌ను పున‌రుద్ధ‌రించే ఏర్పాట్ల‌పై అధికారులు స‌మీక్షిస్తున్నారు. విద్యుత్ కేంద్రంలోకి మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్ర‌భాక‌ర్‌రావు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు, నాగ‌ర్‌క‌ర్నూల్ క‌లెక్ట‌ర్‌, అధికారుల బృందం వెళ్లారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo