శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 10:28:02

పసుపు లోడుతో వెళ్తున్న లారీ దగ్దం..వీడియో

పసుపు లోడుతో వెళ్తున్న లారీ దగ్దం..వీడియో

కరీంనగర్ : కొత్తపల్లి శివారు మీదుగా పసుపు లోడుతో వెళ్తున్న లారీ డీజిల్ ట్యాంకర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ సుధాకర్, క్లీనర్ అజయ్ కు గాయాలయ్యాయి. వారిని మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. లారీలో మొత్తం 350 పసుపు సంచులు ఉన్నాయి. ఒక సంచి రూ. 5 వేల రూపాయల విలువ ఉంటుంది. ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తినష్టం విలువ దాదాపు రూ. 75 లక్షల వరకు (లారీతోపాటు) ఉంటుందని రైతులు తెలిపారు. 

పది మంది రైతులు కలిసి మెండోరా మండలం వెల్గటూర్ నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డుకు పసుపును తరలిస్తుండగా ముప్కాల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరిది మెండోరా మండలం పోచంపాడ్ గ్రామం.logo