శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Aug 28, 2020 , 02:11:37

గౌలిగూడలో అగ్ని ప్రమాదం

గౌలిగూడలో అగ్ని ప్రమాదం

సుల్తాన్‌బజార్‌: హైదరాబాద్‌లోని గౌలిగూడలో ఒక లెదర్‌ షాపులో గురువారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా. సుల్తాన్‌బజార్‌ పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సాగర్‌ అనే వ్యక్తి లక్ష్మీ ట్రేడర్స్‌ పేరిట నాలుగు అంతస్థుల భవనంలో బెల్ట్‌లు, పాఠశాల బ్యాగులు, లెదర్‌గూడ్స్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో దుకాణం మూసి ఇంటికి వెళ్లాడు. తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో మొదటి అంతస్థు నుంచి పొగలు రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు శ్రమించారు. విద్యుదాఘాతం వల్లనే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సుల్తాన్‌బజార్‌ ఏసీపీ దేవేందర్‌, అఫ్జల్‌గంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం రవీందర్‌రెడ్డి మంటలను ఆర్పే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించారు.


logo