బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 12:18:52

ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్‌లో అగ్నిప్ర‌మాదం

ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్‌లో అగ్నిప్ర‌మాదం

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని ఆదర్శ్‌న‌గ‌ర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో బుధ‌వారం ఉద‌యం స్వ‌ల్ప అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. 180వ‌ ఫ్లాట్‌లో షార్ట్‌స‌ర్క్యూట్‌తో మంట‌లు చెల‌రేగాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించింది. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేసింది. ఏసీలో షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల్లే మంట‌లు సంభ‌వించిన‌ట్లు అగ్నిమాప‌క సిబ్బంది నిర్ధారించింది. ఈ ఫ్లాట్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఉంటున్నారు.