ఆదివారం 06 డిసెంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 14:55:01

మేడ్చ‌ల్ రైల్వే స్టేష‌న్‌లో అగ్నిప్ర‌మాదం

మేడ్చ‌ల్ రైల్వే స్టేష‌న్‌లో అగ్నిప్ర‌మాదం

మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి : మేడ్చ‌ల్ రైల్వేస్టేష‌న్‌లో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. నిలిపి ఉంచిన‌ ఓ బోగీలో మంట‌లు చెల‌రేగ‌డంతో రైల్వే సిబ్బంది అప్ర‌మ‌త్త‌మైంది. మ‌రో బోగీకి మంట‌లు వ్యాపించాయి. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేసింది. క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా ప‌రిమిత రైలు సర్వీసుల వ‌ల్ల కొన్ని బోగీల‌ను ప‌క్క‌కు నిలిపి ఉంచారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలుసుకునేందుకు అధికారులు య‌త్నిస్తున్నారు.