శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 05, 2021 , 02:19:13

సాగర్‌ విద్యుత్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం

సాగర్‌ విద్యుత్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం

నందికొండ, జనవరి 4 : నాగార్జునసాగర్‌ డ్యాం ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రంలో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. 8వ టర్బైన్‌ మరమ్మతుల్లో భాగంగా ఏర్పాటు చేయనున్న ట్రాన్స్‌ ఫార్మర్‌కు వైండింగ్‌లోని తేమను తొలగించేందుకు హీటర్లను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో హీటర్ల వేడికి టాన్స్‌ఫార్మర్‌పై కప్పిన టార్పాలిన్‌ కాలి  ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది వెంటనే మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదానికి గురైన జలవిద్యుత్‌ కేంద్రాన్ని హైడల్‌ డైరెక్టర్‌ వెంకట్‌రాజన్‌ సందర్శించారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించడంతో ఎలాంటి నష్టం జరుగలేదని ఆయన చెప్పారు.


logo