శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 05, 2020 , 13:14:20

సుల్తాన్‌బజార్‌లో అగ్ని ప్రమాదం

సుల్తాన్‌బజార్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: నగరంలోని సుల్తాన్‌బజార్‌లోని బ్యాంక్‌ స్ట్రీట్‌లో ఒక భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. భవనంలోని మొదటి అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో భవన పనులు నడుస్తున్నందున ఎటువంటి వ్యాపార సముదాయాలు లేవు. అంతస్తులో ఉన్న చివరి గదిలో అగ్ని ప్రమాదం జరగ్గా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అందులో విలువైన సామాగ్రి కూడా ఏమీ లేకపోవడంతో పెద్దగా ఆస్తి నష్టం కూడా జరగలేదు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసారు.


logo