బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 12:54:33

క‌రీంన‌గ‌ర్ విద్యుత్ కార్యాల‌యంలో అగ్నిప్ర‌మాదం

క‌రీంన‌గ‌ర్ విద్యుత్ కార్యాల‌యంలో అగ్నిప్ర‌మాదం

కరీంనగర్‌: ‌జిల్లా కేంద్రం‌లోని విద్యుత్‌ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్యాలయం సమీపంలోని ఎన్పీడీసీఎల్ ఎలక్ట్రిసిటీ గోదాం‌లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. పదుల సంఖ్యలో ఉన్న కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను ఆర్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్రమాదానికి గ‌ల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు.  

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక, పోలీస్ క‌మిష‌న‌ర్‌ కమలాసన్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాదంపై ఆరా తీశారు. ఎలక్ట్రిసిటీ స్టోర్ రూమ్ ప్రక్కనే ఉన్న విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించారు.


logo