బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 11:15:15

గోషామహల్‌ పోలీస్‌ స్టేడియంలో భారీ అగ్నిప్రమాదం

గోషామహల్‌ పోలీస్‌ స్టేడియంలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ : నగరంలోని గోషామహల్‌ పోలీస్‌ స్టేడియంలో నేటి తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. ఈ మంటల్లో వివిధ కేసుల్లో సీజ్‌ చేసిన 30 వాహనాలు దగ్ధమయ్యాయి. మంటలను గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసు అధికారులను అప్రమత్తం చేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చింది. కాగా అగ్నిప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


logo