శనివారం 11 జూలై 2020
Telangana - Apr 28, 2020 , 17:06:08

కాలువ పనులు త్వరగా పూర్తిచేయండి.. హరీష్‌ రావు

కాలువ పనులు త్వరగా పూర్తిచేయండి.. హరీష్‌ రావు

సిద్దిపేట: రంగనాయకసాగర్‌ కుడి, ఎడమ కాలువల పనుల పురోగతిపై మంత్రి హరీష్‌ రావు సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం జలాలను నేరుగా రైతుల పంట పొలాలకు చేరేలా అవసరమైన భూమిని సేకరించాలని అధికారులను ఆదేశించారు. రంగనాయక సాగర్‌, మళ్లన్న సాగర్‌ ప్రాజెక్టుల పనుల్లో భాగంగా ఇప్పటి వరకు జరిపిన, చేపట్టాల్సిన భూసేకరణపై జిల్లా కలెక్టర్‌, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రంగనాయక సాగర్‌ 10వ ప్యాకేజీ, మల్లన్నసాగర్‌ 11, 12వ ప్యాకేజీల్లో పిల్ల కాలువలు, డిస్ట్రిబ్యూటరీ కాలువలు,  మైనర్‌ కాలువల కోసం భూసేకరణ చేపట్టాల్సి ఉందని, ఆయా మండలాల తహశీల్దార్లు ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. అవసరమైతే ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని చెప్పారు. 


logo