శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 11, 2020 , 06:34:11

అధిక ధరలకు మాస్కులు.. మెడికల్‌ షాపులకు జరిమానా

అధిక ధరలకు మాస్కులు.. మెడికల్‌ షాపులకు జరిమానా

హైదరాబాద్ : నగరంలోని శేరిలింగంపల్లి సర్కిల్‌ పరిధిలోని పలు మెడికల్‌ షాపుల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించి చలాన్లు విధించారు. కరోనా వైరస్‌ రాకుండా అడ్డుకునే మాస్కులను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారం అందుకున్న శేరిలింగంపల్లి సర్కిల్‌ ఏఎంవోహెచ్‌ డాక్టర్‌ రంజిత్‌ ఆకస్మికంగా మందుల దుకాణాల తనిఖీకి వెళ్లారు. నల్లగండ్ల, గోపన్‌పల్లి, లింగంపల్లి ప్రాంతాల్లోని పలు మెడికల్‌ షాపుల్లో మాస్కులను అధిక ధరలకు విక్రయిస్తుండడంతో ఆయా షాపులకు జరిమానా విధించారు. కాగా నల్లగండ్లలోని అపర్ణ మెడికల్‌ అండ్‌ జనరల్‌ స్టోర్‌కు రూ.20 వేలు, లింగంపల్లి ప్రశాంత్‌నగర్‌లోని ఎంఈడీ ఫార్మసీకి రూ.10 వేలు, మరో మెడికల్‌ షాపునకు రూ.10 వేలు జరిమానా విధించారు. 


logo