శనివారం 30 మే 2020
Telangana - May 14, 2020 , 01:16:48

లాయర్లందరికీ ఆర్థికసాయం

లాయర్లందరికీ ఆర్థికసాయం

  • వినోద్‌కుమార్‌కు జాగృతి లీగల్‌సెల్‌ వినతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అనుభవం, వయస్సుతో నిమి త్తం లేకుండా ఇబ్బందుల్లో ఉన్న న్యాయవాదులందరికీ ప్రభుత్వ ఆర్థికసాయాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు తెలంగాణ జాగృతి లీగల్‌ సెల్‌ ప్రతినిధులు విజ్ఞప్తిచేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయనకు వినతిపత్రం అందజేశారు. లాక్‌డౌన్‌ కారణంగా కోర్టులు మూతపడటంతో ఇబ్బందులు పడుతున్న న్యాయవాదులను ఆదుకోవడం కోసం సీఎం కేసీఆర్‌ రూ.25 కోట్లు కేటాయించారని, ఇందుకు కృషిచేసిన వినోద్‌కుమార్‌కు జాగృతి లీగల్‌సెల్‌ కన్వీనర్‌ తిరుపతివర్మ కృతజ్ఞతలు తెలిపారు. 


logo