సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 00:36:27

రైతు వేదికలు దేవాలయాలు

రైతు వేదికలు దేవాలయాలు

  • దసరా నాటికి సిద్ధంచేస్తాం
  • రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి

జఫర్‌ఘడ్‌: రైతుల ఆర్థికాభివృద్ధి కోసం నిర్మిస్తున్న రైతు వేదికలు వారికి దేవాలయాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఒక్కో రైతు వేదికకు రూ.22 లక్షలు వెచ్చిస్తున్నామని, రాష్ట్రంలో 2,604 రైతు వేదికల నిర్మాణానికి రూ.572 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. దసరా నాటికి రైతు వేదికల నిర్మాణాలు పూర్తవుతాయని ఆయన స్పష్టంచేశారు. శుక్రవారం జనగామ జిల్లా జఫర్‌ఘడ్‌ మండలం తీగారం, తమ్మడపల్లి(జీ), జఫర్‌ఘడ్‌, కూనూరు, ఉప్పుగల్లు క్లస్టర్లలో నిర్మించే రైతువేదికల భవనాలకు స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. ఆపత్కాలంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.30 వేల కోట్లు కేటాయించి రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసిందన్నారు. రైతు రుణమాఫీకి రూ.12 వేల కోట్లు, రైతుబంధు పథకానికి రూ.7,500 కోట్లు విడుదల చేసిన ఘనత తెలంగాణ సర్కార్‌దేనని పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.logo