మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 01:30:22

రైతులకు ఆర్థిక భరోసా

రైతులకు ఆర్థిక భరోసా

  • రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి

స్టేషన్‌ఘన్‌ఫూర్‌: రైతులు ఆర్థికంగా ఎదిగేందు కు సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఉపయోగపడేలా రైతు వేదికలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం జనగామ జిల్లా చిలుపూర్‌ మండలంలోని రాజవరం, చిలుపూర్‌ గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తూ టీఆర్‌ఎస్‌ రైతు సంక్షేమ ప్రభుత్వంగా నిలిచిందన్నారు. గ్రామాల్లోనే కేంద్రాలను ఏర్పాటుచేసి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానికి దక్కిందని స్పష్టంచేశారు. 

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ దేశానికి అన్నపూర్ణలా మారిందని పునరుద్ఘాటించారు. దసరా నాటికి వేదికల నిర్మాణం పూర్తిచేయాలని అధికారులను, గుత్తేదారులను ఆయన ఆదేశించారు. అనంతరం రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా తయారుచేసిన వరి విత్తనాలను జెడ్పీ చైర్మన్‌ సంపత్‌రెడ్డితో కలిసి పల్లా రైతులకు అందజేశారు. తరువాత చిలుపూర్‌ మండలంలోని నర్సరీని పరిశీలించారు. 


logo