బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Oct 20, 2020 , 07:40:53

వరద బాధితులకు నేటి నుంచి ఆర్థిక సాయం

వరద బాధితులకు నేటి నుంచి ఆర్థిక సాయం

హైదరాబాద్‌ : వరద బాధితులకు అధికారులు నేటి నుంచి ఆర్థిక సాయం పంపిణీ చేయనున్నారు. వరద ప్రభావిత కుటుంబాలకు చొప్పున రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందనుంది. ఇందు కోసం సీఎం సహాయనిధి నుంచి రూ.550కోట్లు కేటాయించారు. ముగ్గురు అధికారుల కమిటీ ద్వారా బాధితులకు ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఇందుకు కుటుంబ, భౌగోళిక వివరాలను యాప్‌లో పొందుపరచాలని ప్రభుత్వం అధికారులను సూచించింది. మొత్తం ప్రక్రియను వారంరోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ.లక్ష సాయం, పాక్షికంగా దెబ్బతిన్న వారికి రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనున్నారు. అధికారులు ఇండ్లకే వద్దకే వెళ్లి సాయం అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఆధార్‌, రేషన్‌ కార్డుల వివరాలను నమోదు చేయాలని, డూప్లికేషన్‌కు తావు లేకుండా ఒకేసారి అందేలా చూడాలని చెప్పింది. కుటుంబ యజమానితో పాటు ముగ్గురు అధికారుల సంతకాలు చేయాలని, ఇతర నగర, మున్సిపాలిటీల్లోనూ ఇదే విధానం అమలు చేయాలని చెప్పింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.