శుక్రవారం 29 మే 2020
Telangana - Feb 08, 2020 , 01:40:40

పల్లెప్రగతి దేశానికే ఆదర్శం

పల్లెప్రగతి దేశానికే ఆదర్శం
  • ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పల్లెప్రగతితో గ్రామాల స్వరూపమే మారిపోయిందని.. ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. పల్లెప్రగతి మాదిరిగానే త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు మంత్రి తెలిపారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి శుక్రవారం మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మెదక్‌ కలెక్టరేట్‌లో టీఎన్జీవో డైరీ, క్యాలెండర్‌ను టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్యాం రావుతో కలిసి ఆవిష్కరించారు. అంతకుముందు మెదక్‌ మున్సిపల్‌ తొలి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఏడుపాయలకు జాతరకు మంజూ రు చేసిన రూ.75 లక్షలను సక్రమంగా వినియోగించుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మరో రూ.25 లక్షలు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.  అనం తరం జిల్లాకేంద్రంలోని ఏరియా దవాఖానలో రూ.35 లక్షలతో ఏర్పాటు చేసిన రోగ నిర్దారణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.  
logo