శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 04:00:53

25వేల లోపు రుణాలు నెలా ఖరులోగా మాఫీ

 25వేల లోపు రుణాలు నెలా ఖరులోగా మాఫీ

రైతు రుణమాఫీకి సంబంధించి ముందుగా రూ.25వేలలోపు వారికి ఈ నెలాఖరులోగా చెక్కులు అందజేయనున్నట్టు ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు. ఎమ్మెల్యేల ద్వారా ఈ చెక్కులను పంపిణీచేస్తామని చెప్పారు.

  • ఎమ్మెల్యేల చేతుల మీదుగా 5.85లక్షల మందికి చెక్కుల పంపిణీ
  • ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు వెల్లడి
  • మిగిలిన రుణమాఫీ నాలుగు విడుతలుగా విడుదల
  • కేంద్రం నిధులు ఇవ్వకున్నా సంక్షేమానికి కోత విధించలేదు
  • ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోనే అప్పులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతు రుణమాఫీకి సంబంధించి ముందుగా రూ.25వేలలోపు వారికి ఈ నెలాఖరులోగా చెక్కులు అందజేయనున్నట్టు ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు. ఎమ్మెల్యేల ద్వారా ఈ చెక్కులను పంపిణీచేస్తామని చెప్పారు. అసెంబ్లీలో ఆదివారం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం కమిటీహాల్‌లో ఆయన ‘సామాజిక, ఆర్థిక సర్వే - 2020’ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రూ.25వేలలోపు రుణమాఫీకి అర్హులైన రైతులు 5.86 లక్షలమంది ఉన్నారని చెప్పారు. రుణమాఫీపై ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని అమలుచేయాలని సీఎం కేసీఆర్‌ కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. మిగిలిన రుణమాఫీని నాలుగు విడుతలుగా చెక్కులు అందజేస్తామని చెప్పా రు. 


వ్యాట్‌కు సంబంధించిన పలు కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని, వాటన్నింటిని వన్‌టైం సెటిల్‌మెంట్‌ ద్వారా పరిష్కరిస్తే నిధులు వస్తాయని చెప్పా రు. అంతర్గత ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోనే అప్పు లు తీసుకున్నామని తెలిపారు. హైదరాబాద్‌ నగరా న్ని అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్నది కేసీఆర్‌ ఆలోచన అని తెలిపారు. హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.50 వేలకోట్లు అవసరమని, ఇందుకు సాయంచేయాలని కేంద్రాన్ని కోరినా స్పందనరాలేదని చెప్పారు. దీంతో రాష్ట్రప్రభుత్వమే నిధులు వెచ్చించాలని నిర్ణయించిందన్నారు. 


సంక్షేమానికి కోత విధించలేదు

ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాలకు నిధులను భారీగా కేటాయించామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నిధుల విడుదలలో కేంద్రం కోతవిధించినా, తాము సంక్షేమరంగానికి ఒక్కపై సా కోతపెట్టలేదని చెప్పారు. ఆసరా పింఛన్లకు గత సంవత్సరం కంటే 25 శాతం అధికంగా నిధులు కేటాయించామన్నారు.  రెసిడెన్షియల్‌ పాఠశాలలకు రూ.553 కోట్లు అదనంగా కేటాయించామని, ఆర్థికమాంద్యం నే పథ్యంలో పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు రూ.1500 కోట్లు కేటాయించామన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్టు ఖాళీస్థలాలు ఉన్న పేదలు ఇండ్లు కట్టుకుంటే ఆ ర్థిక సాయమందించడానికి లక్షమందికి బడ్జెట్‌ లో 10,500 కోట్లు కేటాయించామన్నారు.

 

జోరుమీదున్న రియల్‌ ఎస్టేట్‌

రాష్ట్రంలో రియల్‌ఎస్టేట్‌ రంగం పెద్ద పరిశ్రమగా విస్తరించిందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. నిరర్థక ఆస్తులను విక్రయించాలని నిర్ణయించామని, రాజీవ్‌స్వగృహ, హౌసింగ్‌బో ర్డు ఇండ్లు, భూములు, దిల్‌ భూముల విక్ర యం ద్వారా నిధులు సమకూర్చుకుంటామ ని తెలిపారు. ప్రభుత్వ భూములను కాపాడుకోవడానికి కేసులు వేసి గెలిచామని, ఆ భూములను విక్రయిస్తామన్నారు. సమావేశంలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్థిక సలహాదారు జీఆర్‌రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శులు రొనాల్డ్‌ రాస్‌, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. 


జీఎస్టీ బకాయిలు రావాలి

చట్టప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం ఇవ్వడంలేదని హరీశ్‌రావు చెప్పారు. 2019-20 సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి నాటికి రూ.3196కోట్లు రావాల్సి ఉందని, కానీ రూ.2263కోట్లు మాత్రమే వచ్చాయని చెప్పారు. పన్నుల వాటా బదలాయింపులో రూ.4595కోట్లు తగ్గాయన్నారు. 15వ ఆర్థికసంఘం సిఫారసుల ద్వారా రూ.2384కోట్లు తగ్గుతాయని అంచనా వేశామన్నారు. ఆర్థికసంఘం రూ.730కోట్లు గ్రాంట్‌గా రాష్ట్రానికి ఇవ్వాలని సిఫారసు చేసిందని, వాటిని కేంద్రం విడుదల చేయడం లేదని తెలిపారు.logo