వరద సాయంతో హైదరాబాద్‌కు రండి!

సంగారెడ్డి: 'హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు కనిపించని బీజేపీ నేతలు.. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు..? వరదలు వచ్చినప్పుడు, కరోనా సమయంలో ప్రజలు ఇండ్లకు పరిమితమైనప్పుడు బీజేపీ నేతలకు హైదరాబాద్ ఎందుకు గుర్తుకు రాలేదు. ఓట్ల కోసం బురద రాజకీయాలు చేస్తున్న ఆ పార్టీ నాయకులకు నగర ప్రజలపై ఏమాత్రం అభిమానం ఉన్నా కనీసం రూ.2 వేల కోట్ల వరద సాయంతో ఇక్కడకు రావాలని' ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలకు బీజేపీకి చెందిన నేతలు వరుసకట్టి హైదరాబాద్‌కు రావడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు అమిత్‌షా, పడ్నవిస్, యోగీ ఆదిత్యనాథ్, స్మృతి ఇరానీ..నేతలంతా ఇక్కడకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేస్తున్నది. అయితే బీజేపీ నేతలు మాత్రం అభివృద్ధి, ఇతర అంశాలను పక్కన పెట్టి సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటున్నారు. ఎవరిమీద సర్జికల చేస్తారని మంత్రి సూటిగా ప్రశ్నించారు.
శనివారం పటాన్చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ డివిజన్ల పరిధిలోని మైనార్టీ నాయకుల సమావేశాల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. మున్నూరుకాపు సంఘం సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిద పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
తాజావార్తలు
- బిజినెస్ ఫ్రెండ్లీకి దెబ్బ: ‘మహా’ సర్కార్‌కు జీఎం వార్నింగ్!
- పాలమూరు-రంగారెడ్డి’ని ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలి : సీఎం కేసీఆర్
- 2020 లో జీవితం ఇంతేనయా! చిన్నారులు పాపం..
- దిగివచ్చిన బంగారం ధరలు
- రేపు సర్వార్థ సంక్షేమ సమితి 28వ వార్షికోత్సవాలు
- కేంద్ర బడ్జెట్ కోసం ప్రత్యేక మొబైల్ యాప్
- 2020 బెస్ట్ సెల్లింగ్ మారుతి ‘స్విఫ్ట్’
- రైతుల ట్రాక్టర్ పరేడ్‌కు అనుమతి
- ఇక నుంచి వీళ్లూ పన్నుకట్టాల్సిందే...?
- కంబోడియాలో క్రేజీ ‘బీరు యోగా’!