సోమవారం 06 జూలై 2020
Telangana - May 29, 2020 , 17:14:11

ఆత్మస్థైర్యాన్ని నింపండి..పరీక్షలకు సిద్ధం చేయండి

ఆత్మస్థైర్యాన్ని నింపండి..పరీక్షలకు సిద్ధం చేయండి

హైదరాబాద్ : లాక్ డౌన్ వల్ల వాయిదా పడ్డ పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం తేదీలను ప్రకటించినందున రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులకు సూచించారు. స్థానిక సంక్షేమ భవన్ లోని సమావేశ మందిరంలో ఆశ్రమ పాఠశాలలలో ఉన్న విద్యార్థుల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన పదోతరగతి పరీక్షలు వచ్చే నెల 8వ తేదీన ప్రారంభం అవుతున్నందున విద్యార్థులందరూ సంబంధిత ఆశ్రమ పాఠశాలలో ఈనెల 1న చేరుకుంటారని, వారి ఆరోగ్య పరిరక్షణ గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కరోనా మహమ్మారి వల్ల అందరూ ఆందోళనలో ఉన్నందున సంబంధిత ప్రిన్సిపాల్, స్టాఫ్ నర్సులు, విద్యార్థులు కోవిడ్-19 పై తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు, పరిశుభ్రత భౌతిక దూరం మొదలైన వాటి మీద అప్రమత్తంగా ఉండేలా అందరికీ అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల మధ్య తరగతి గదులు, వసతిగృహాల్లో డైనింగ్ హాలులో భౌతిక దూరం తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల  విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తమ పాఠశాలల్లో మొత్తం 12163 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని వారిలో 4155 మంది బాలురు, 7988 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. మంత్రి గసూచనలు తప్పకుండా పాటిస్తామని తెలిపారు. 


logo