సోమవారం 25 జనవరి 2021
Telangana - Nov 30, 2020 , 00:47:21

పోలింగ్‌కు ముందు బీజేపీలో సస్పెన్షన్ల లొల్లి

పోలింగ్‌కు ముందు బీజేపీలో సస్పెన్షన్ల లొల్లి

నేతల తీరుపై పార్టీ శ్రేణుల ఆగ్రహం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌కు మరో 48 గంటలు ఉందనగా.. బీజేపీలో సస్పెన్షన్ల లొల్లి మొదలైంది. పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వాళ్లకు టికెట్లు దక్కకుండా నేతలు కుట్రచేశారని నిరసన తెలిపిన కార్యకర్తలను.. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ సస్పెండ్‌ చేస్తున్నారని బీజేపీ కార్యకర్తలు వాపోతున్నారు. ఆదివారం బీజేపీ గన్‌ఫౌండ్రీ డివిజన్‌కు చెందిన శైలేంద్రయాదవ్‌, బాగ్‌అంబర్‌పేట డివిజన్‌కు చెందిన కంచె చంద్రశేఖర్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్‌చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాలు జారీచేశారు. ఈ సస్పెన్షన్‌ నిబంధనలకు విరుద్ధమని, పార్టీ పెద్దలు తమ తప్పులను సరిచేసుకోవాల్సిందిపోయి.. ప్రశ్నించినవాళ్లను సస్పెండ్‌ చేయడం సిగ్గుచేటని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజంగా పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలంటే ముందుగా పార్టీ పెద్దల సభ్యత్వాలను రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు.


logo