గురువారం 04 జూన్ 2020
Telangana - May 19, 2020 , 09:36:59

మండుతున్న ఎండలు.. మళ్లీ వర్ష సూచన

మండుతున్న ఎండలు.. మళ్లీ వర్ష సూచన

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. దీనికితోడు గాలిలో తేమ తక్కువగా ఉండడంతో ఉక్కపోత ఎక్కువైంది. సోమవారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40.1, కనిష్ఠం 25.0 డిగ్రీల సెల్సియస్‌, గాలిలో తేమ 26 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే 24 గంటల్లో పలు చోట్ల తేలికపాటి జల్లులు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశమున్నట్లు  తెలిపారు.


logo