గురువారం 28 జనవరి 2021
Telangana - Jan 08, 2021 , 01:11:57

మక్కల ఉత్పత్తి పెరగాలి

మక్కల ఉత్పత్తి పెరగాలి

  • పౌల్ట్రీ, స్టార్చ్‌ పరిశ్రమలకు అవే ఆధారం
  • ఫిక్కీ మెయిజ్‌ విజన్‌ నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌, జనవరి 7(నమస్తే తెలంగాణ) : దేశంలో మక్కలకు డిమాండ్‌ పెరుగుతున్నదని, భవిష్యత్తులో ఆ పంట సాగు పెరగాల్సిన అవసరమున్నదని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ) పేర్కొన్నది. మక్కలతో తయారయ్యే ఉత్పత్తులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది నాటికి దేశంలో 4.5 కోట్ల టన్నుల మక్కలు అవసరమవుతాయని, ఆ మేరకు మక్కల ఉత్ప త్తి 15 శాతం పెరగాల్సిన అవసరం ఉన్నదని తెలిపింది. మెయిజ్‌ విజన్‌-2022 నివేదికను ఫిక్కీ గురువారం విడుదల చేసింది. దీనిప్రకారం.. దేశంలో కోటిన్నర మంది రైతులు మక్క లు సాగుచేస్తున్నారు. మక్క ఉత్పత్తులను వినియోగించే పరిశ్రమలు తొమ్మిది శాతం పెరిగాయి. గత ఐదేండ్లలో మక్క వినియోగం 11 శాతం పెరిగింది. దిగుబడి అవుతున్న మక్కలలో 47 శాతం పౌల్ట్రీ పరిశ్రమల్లోనే వినియోగిస్తున్నారు. మక్కలతో దాదాపు 3,500 ఉత్పత్తులు తయారవుతున్నాయి. మక్కలను భారత్‌లో పౌల్ట్రీ అవసరాలకు 47 శాతం, పశువుల దాణా కోసం 13శాతం, చిరుతిళ్ల తయారీ కోసం 13 శాతం, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ కోసం 7శాతం, స్టార్చ్‌ కోసం 14శాతం, ఎగుమతులు, ఇతర అవసరాల కోసం మరో 14 శాతం ఉపయోగిస్తున్నారు. 


logo