సోమవారం 13 జూలై 2020
Telangana - Apr 27, 2020 , 01:43:53

గోశాలకు దాణా

గోశాలకు దాణా

  • ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ హామీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గోశాలలో గోవులకు అవసరమైన దాణాను పశుసంవర్ధకశాఖ ద్వారా సరఫరా చేస్తానని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. గోశాలలో దాదాపు 120 గోవులు ఉంటాయని, లాక్‌డౌన్‌తో పోషణ కష్టంగా ఉన్నదని వనమా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌చేశారు. దీనిపై మంత్రి స్పందించి భరోసా ఇచ్చారు. అనంతరం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ట్విట్టర్‌లో స్పందించి తప్పకుండా సాయమందిస్తామని చెప్పారు. అలాగే, జనగామ జిల్లా ఎల్లంల గ్రామానికి చెందిన సాయికుమార్‌ (23) అధిక బరువుతో బాధపడుతున్నారు. నిరుపేద కుటుంబం కావడంతో వైద్యం చేయించుకోలేకపోతున్నారు. దీంతో అతని సమస్యను తెలిసినవారు ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి ఆ అబ్బాయికి చికిత్స అందించే బాధ్యతను మాజీ ఎంపీ బూర నర్సయ్యకు అప్పగించారు.logo