గురువారం 04 జూన్ 2020
Telangana - May 15, 2020 , 01:54:38

చిన్నతరహా పరిశ్రమలను ఆదుకోవాలి

చిన్నతరహా పరిశ్రమలను ఆదుకోవాలి

  • వినోద్‌కుమార్‌తో పరిశ్రమల సంఘం నేతల భేటీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న చిన్నతరహా పరిశ్రలను ఆదుకోవాలని ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు గురువారం వినతిపత్రం అందజేశారు. మూడు నెలల విద్యుత్‌ బిల్లులు, ఆరునెలలపాటు ఆస్తిపన్ను మాఫీచేయాలని కార్మికులకు పారిశ్రామికవాడల్లో వసతి ఏర్పాటు, పెండింగ్‌ రుణాలు విడుదల చేయించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కేవీ రామేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శివసాంబిరెడ్డి, అప్పిరెడ్డి, గోకుల్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు.


logo