చిన్న చిన్న పాత్రలతో నటిగా కెరీర్ ను ప్రారంభించి..హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది వరంగల్ అమ్మడు ఈషారెబ్బా. ఈ భామ ఇటీవల సోషల్మీడియాలో గ్గామరస్, స్టైలిష్ స్టిల్స్ ను పోస్ట్ చేయగా..ఆ ఫొటోలు కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. చివరిసారిగా తెలుగులో అరవింద సమేత లాంటి పెద్ద చిత్రంలో సెకండ్ లీడ్ రోల్లో కనిపించింది. అయితే ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ మినహా ఈ భామకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తమిళం, మలయాళంపై దృష్టి పెట్టింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేస్తూ ఎక్జయిటెడ్గా ఉందని ట్వీట్ చేసింది.
ఈషారెబ్బా మలయాళంలో ఒట్టు అనే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మరోవైపు తమిళ సినిమాలో కూడా నటిస్తోంది. ఈషారెబ్బా తన మకాంను కేరళకు మార్చేసినట్టు ఫిలింనగర్ సర్కిల్లో జోరుగా టాక్ నడుస్తోంది. మరి కేరళ కుట్టీలు తెలుగులో రాణిస్తున్నట్టే..ఈషా రెబ్బా కూడా మాలీవుడ్లో పాగా వేయాలని విష్ చేస్తున్నారు సినీ ప్రియులు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.