బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Feb 28, 2020 , 09:38:46

ఫిబ్రవరి 28 శుక్రవారం 2020..మీ రాశిఫలాలు

ఫిబ్రవరి 28 శుక్రవారం 2020..మీ రాశిఫలాలు

మేషరాశి : ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశముంది. ఉద్యోగ విషయంలో సామాన్య దినం. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు.

వృషభం: ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చు లు కానీ ప్రయాణాలు కానీ చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బు కానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం.

మిథునం:   ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు రావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పను లు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి.  

కర్కాటకం :  ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీ యానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

సింహం : ఈ రోజు మీరు దూర ప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీ యానానికి సంబంధించి ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసుకుంటారు.

కన్య :  ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. 

తుల : ఈ రోజు నూతన వ్యాపార ఒప్పందాలు కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ పూర్తి చేస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహనం కొనటం కానీ, మరమ్మతుచేయించటం కానీ చేస్తారు. నూతన వస్ర్తా భరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తిలో అనుకూల పరిణామాలు ఏర్పడతాయి.

వృశ్చికం : ఈ రోజు మీ వృత్తిలో అనుకోని మార్పు చోటు చేసుకుంటుంది. మీరు ఎదురు చూస్తున్న పదోన్నతికానీ, పదవిలో మార్పుకానీ చోటుచేసుకుంటుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ వ్యాపార భాగస్వాములతో ఉన్న మనస్పర్థలు తొలగి పోతాయి.  ప్రయాణంలో జాగ్రత్త అవసరం. 

ధనుస్సు : ఈరోజు మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. మీ సంతానం లేదా మీకు ఇష్టమైన వారి ఆరోగ్య పరిస్థితి మీ ఆందోళనకు కారణమవుతుంది. మీరు పూర్తి చేస్తానన్న పనులు పూర్తి చేయకపోవటం వలన మీ పై అధికారులు మీపై అసహనం వ్యక్తం చేస్తారు.  

మకరం:   ఈ రోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడటం కారణంగా మానసిక అశాంతికి, ఆవేశానికి గురవుతారు. అనుకోని ఖర్చులు కానీ, నష్టాలు కానీ మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తాయి. ఎక్కువ ఆవేశానికి లోను కాకుండా స్థిమితంగా ఆలోచించటం వలన సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంటుంది.

కుంభం : ఈ రోజు మీ వృత్తిలో మార్పు కానీ, అనుకోని ప్రయాణం కానీ చోటు చేసుకుంటుంది. ఇతరుల బాధ్యతలను, పనిని మీరు చేయవలసి రావచ్చు. మీ పట్టుదలతో దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సహోద్యోగులతో మెలిగేప్పుడు జాగ్రత్త అవసరం, మిమ్మల్ని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

మీనం:  ఈ రోజు మాట విషయంలో, ఆర్థిక వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరం. అనవసర వాదనల వలన మీ గౌరవానికి భంగం కలిగే ప్రమాదం ఉంటుంది.  మానసికంగా స్థిరంగా ఉండటం, మీపై మీరు నమ్మకాన్ని కోల్పోకుండా ఉండటం వలన అన్ని విషయాల్లో ఇబ్బందుల నుంచి బయట పడగలుగుతారు.


logo
>>>>>>