శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 01:52:45

లాక్‌డౌన్‌ వేళ ఫేవరెట్‌ ఫుడ్‌ ‘బిర్యానీ’!

లాక్‌డౌన్‌ వేళ ఫేవరెట్‌ ఫుడ్‌ ‘బిర్యానీ’!

న్యూఢిల్లీ: కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ సమయంలో దేశవ్యాప్తంగా ప్రజలకు ఇష్టమైన ఆహారంగా ‘బిర్యానీ’ నిలిచింది. 5.5 లక్షల మందికి పైగా బిర్యానీ కోసం ఆర్డర్‌ చేశారని ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ తెలిపింది. బటర్‌నాన్‌ కోసం 3,35,185, మసాలా దోశ కోసం 3,31,423 మంది ఆర్డర్‌ చేశారని పేర్కొంది. చాకో లావా కోసం 1.29 లక్షలు, గులాం జమూన్‌ కోసం 84,558 ఆర్డర్లు వచ్చాయని వెల్లడించింది. ‘స్టాటిస్టిక్స్‌ రిపోర్ట్‌: ది క్వారంటైన్‌ ఎడిషన్‌' పేరిట విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. ఎక్కువ మంది ఆర్డర్‌ చేసిన ఆహార జాబితాలో బిర్యానీ వరుసగా నాలుగేండ్లు మొదటి స్థానం దక్కుందచుందని స్విగ్గీ తెలిపింది. logo