శనివారం 30 మే 2020
Telangana - May 18, 2020 , 23:04:19

ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని చంపిన తండ్రి..

ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని చంపిన తండ్రి..

తమిళనాడు: రాష్ట్రంలోని కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూరులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని చంపిన తండ్రి అనంతరం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు ఇద్దరు కుమార్తెలు 12, 10 సంవత్సరాల వయస్సు వాళ్లు కాగా, కుమారుడి వయస్సు ఎనిమిదేళ్లు. బావిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా, మరొకరి కోసం గాలిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దొరికిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాత్రి కావడంతో గాలింపు చర్యలు నిలిచిపోయాయి. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని స్థానికుల సమాచారం. 


logo