శనివారం 30 మే 2020
Telangana - May 14, 2020 , 13:24:41

తండ్రిని హత్య చేసిన తనయుడు

తండ్రిని హత్య చేసిన తనయుడు

కామారెడ్డి : భిక్కనూరు మండలం తిప్పాపూర్‌ గ్రామంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో తండ్రిని తనయుడు అత్యంత దారుణంగా హత్య చేశాడు. గొడ్డలితో తండ్రి తలపై బాదడంతో.. అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ లక్ష్మీనారాయణ ఘటనాస్థలిని పరిశీలించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని మొగులయ్యగా, నిందితుడిని ప్రశాంత్‌గా పోలీసులు గుర్తించారు. ప్రశాంత్‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


logo