మంగళవారం 02 జూన్ 2020
Telangana - Feb 19, 2020 , 11:22:21

బైక్‌ను ఢీకొన్న కారు : తండ్రి మృతి, కుమారుడికి గాయాలు

బైక్‌ను ఢీకొన్న కారు : తండ్రి మృతి, కుమారుడికి గాయాలు

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ రైల్‌ నిలయం వద్ద ఇవాళ ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. స్కూల్లో తమ కుమారుడిని దింపేందుకు గిరి అనే వ్యక్తి బైక్‌పై వెళ్తున్నాడు. రైల్‌ నిలయం వద్దకు రాగానే గిరి బైక్‌ను ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గిరి మృతి చెందాడు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


logo