ఆదివారం 23 ఫిబ్రవరి 2020
చెరువులో పడి తండ్రీకుమారుడు మృతి

చెరువులో పడి తండ్రీకుమారుడు మృతి

Feb 15, 2020 , 13:12:29
PRINT
చెరువులో పడి తండ్రీకుమారుడు మృతి

ఖమ్మం : కారేపల్లి మండలం గుంపెల్లగూడెంలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి తండ్రీకుమారుడు మృతి చెందారు. బట్టలు ఉతికేందుకు కుమారుడు చెరువులోకి వెళ్లాడు. ఆ పిల్లాడు ప్రమాదవశాత్తు చెరువులో పడిపోవడంతో.. అతడిని కాపాడే ప్రయత్నంలో తండ్రి కూడా మునిగిపోయాడు. తండ్రీకుమారుడు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులను సత్యనారాయణ(48), భరత్‌(14)గా పోలీసులు గుర్తించారు. మృతుల నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 


logo