శనివారం 06 జూన్ 2020
Telangana - May 15, 2020 , 06:03:45

ఈత నేర్చుకునేందుకు వెళ్లి తండ్రి, కొడుకు గల్లంతు

ఈత నేర్చుకునేందుకు వెళ్లి తండ్రి, కొడుకు గల్లంతు

తిమ్మాజిపేట: ఈత నేర్చుకునేందుకు తండ్రి వెంట వెళ్లిన ఓ బాలుడు నీటిలో మునిగి ప్రాణాలు వదిలాడు. కాగా తండ్రి ఆచూకీ లభించలేదు. ఈ ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. తిమ్మాజిపేటకు చెందిన బోయ గురుకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. పెద్ద కొడుకు శివ(9)కు ఈత నేర్పేందుకు తండ్రి రోజూ గ్రామ శివారులోగల అమ్మ చెరువు సమీపంలోని వ్యవసాయ బావికి తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం వెళ్లిన వారు రాత్రి వరకు తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సర్పంచ్‌ వేణుగోపాల్‌గౌడ్‌ను ఆశ్రయిం చారు. ఆయనతోపాటు గ్రామస్థులు అక్కడికి వెళ్లి చూడగా కొత్తబావి గట్టుపై దుస్తులు కనిపించాయి. టార్చిలైట్ల వెలుతురులో బావిలో వెతుకగా శివ మృతదేహం కనిపించింది. కాగా రాత్రి 10 గంటల వరకు కూడా తండ్రి గురు ఆచూకీ లభించలేదు.


logo